ఏపీ పోలీస్ అధికారిక వెబ్సైట్
‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీపోలీస్.జీవోవీ.ఇన్’ ద్వారా ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే 60కి పైగా పౌరసేవలు పొందవచ్చని ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో ఫిర్యాదులు, పిటిషన్ స్టేటస్, ఎఫ్ఐఆర్ వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ, పాస్‌పోర్ట్, ఉద్యోగుల వెరిఫికేషన్, పోగొట్టుకున్న వస్తువుల నమోదు, మిస్సింగ్ వ్యక్తుల వివరాలు, ఈ-చలాన్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రత్యేకంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వెబ్సైట్ ద్వారా సేవలు పొందడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

