UPI చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫోన్‌పే యూజర్లకు సంస్థ శుభవార్త తెలిపింది. భారతదేశంలోని ఫోన్‌పే వినియోగదారులకు UPI చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని సంస్థ CEO సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. UPI ద్వారా చెల్లింపులు చేసినందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. దీంతో ఫోన్‌పే యూజర్లలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. సాధారణ డిజిటల్ చెల్లింపులు, రోజువారీ లావాదేవీలపై అదనపు భారం ఉండదని సంస్థ స్పష్టం చేయడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.



