రామచంద్రపురం మండలం ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి
కమ్మపల్లి–అప్పలాయగుంట మార్గమధ్యంలో శుక్రవారం రాత్రి కొండచిలువ దర్శనమిచ్చింది. నడిరోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై కాసేపు సంచరించి తర్వాత చెట్లలోకి వెళ్లింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పశువుల రాత్రిపూట నడిచి పాదయాత్రగా వెళ్లే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.


