దొరవారిసత్రం మండలంలో ఉదయం 6 నుంచి 11 వరకు పవర్ కట్*
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
DV Satram: ఆగస్టు 8న విద్యుత్ లైన్లు, ఫీడర్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో దొరవారిసత్రం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. మన్నూరుపోలూరు 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని బ్రేకర్లు, ఫీడర్లు, 33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలోని విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టనుందున ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని, పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.


