*నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదా దేవి.*
తిరుపతి ఆగస్ట్ 07పున్నమి ప్రతినిధి
పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీలో అధికారులు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదా దేవి తెలిపారు. 167- తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో బి.ఎల్.ఓ.లు, సూపర్వైజర్లకు మరియు అడిషనల్ AEROs& AEROs లకు డ్రాఫ్ట్ రోల్ తరువాత చేయు కార్యాచరణపై కచ్చపి ఆడిటోరియం లో శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమం లో నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శారదా దేవి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు.ముసాయిదాకు ముందు కాలంలో చేసిన పనుల గురించి వివరించారు. ముసాయిదాకు ముందు కాలంలో, 2025 తుది ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాతో మ్యాప్ చేయడం జరిగిందని తెలిపారు. మ్యాపింగ్ కాని మరియు తార్కిక వ్యత్యాసాల వర్గం (Logical Discripancies) కిందకు వచ్చే ఓటర్ల విచారణల కోసం వేర్వేరు షెడ్యూల్ తేదీలను నిర్ణయించామని తెలిపారు. నోటీసులను జారీ చేయడం, ఓటర్ల వ్యక్తిగత హాజరు కోసం విచారణలను షెడ్యూల్ చేయడం మరియు అవసరమైన పత్రాలను అందించడం గురించి వివరించారు. ఓటర్ల విచారణ, హాజరు నమోదు, పత్రాలను అప్లోడ్ చేయడం వంటి అంశాలపై BLOలకు శిక్షణ ఇచ్చారు. ఓటర్ల నాణ్యతను తనిఖీ చేయడం మరియు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రతి ఓటరుకు మంచి నాణ్యత గల ఫోటోను సమర్పించడం. పలు సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమం లో అడిషనల్ ఏఈఆర్వో లు అమరయ్య, సురేష్ బాబు, శ్యాంసుందర్, ఈడిటి సుధాకర్ నాయక్, ఏఈఆర్వో లు, బి.ఎల్.ఓ లు పాల్గొన్నారు.



