# ప్రశాంత్‌నగర్, కేపీహెచ్‌బీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ప్రశాంత్‌నగర్, కేపీహెచ్‌బీ డివిజన్‌లలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. యాంజాల పద్మయ్య, ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.


