చిత్తూరు ఆగస్టు 07 పున్నమి ప్రతినిధి
DSC–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో నేడు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో, ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి గారి నాయకత్వంలో, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగింది.
ఈ దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.
నిజాయితీగా చదివిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు!
DSC అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి!
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి!




