Friday, 7 August 2026
  • Home  
  • ఆషాడమాస బోనాల వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
- వరంగల్

ఆషాడమాస బోనాల వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

*వరంగల్ జిల్లా* *నర్సంపేట నియోజకవర్గం* *తేదీ/07/08/2026/శుక్రవారం* *ఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న* *-మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్* ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు నర్సంపేట బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బోనాల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు, కళాశాల విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను సమర్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతిపై అవగాహన పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోర్తాల రామ్ రాజ్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు..

*వరంగల్ జిల్లా*
*నర్సంపేట నియోజకవర్గం*
*తేదీ/07/08/2026/శుక్రవారం*

*ఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న*
*-మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్*

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు నర్సంపేట బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బోనాల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు, కళాశాల విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను సమర్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతిపై అవగాహన పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు..
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోర్తాల రామ్ రాజ్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.