*వరంగల్ జిల్లా*
*నర్సంపేట నియోజకవర్గం*
*తేదీ/07/08/2026/శుక్రవారం*
*ఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న*
*-మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్*
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు నర్సంపేట బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బోనాల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు, కళాశాల విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను సమర్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతిపై అవగాహన పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు..
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోర్తాల రామ్ రాజ్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు..


