ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
పున్నమి ప్రతినిధి
కాగజ్‌నగర్ | ఆగస్టు 5, 2026
కాగజ్‌నగర్ మాజీ కోఆప్షన్ సభ్యుడు **** (బాబా భాయ్) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని **** ఆధ్వర్యంలో, కోయవాగు–చింతగూడ ప్రాంత నాయకుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి కోనేరు రమాదేవి బాబా భాయ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబా భాయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.


