Monday, 3 August 2026
  • Home  
  • 1వ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
- నిర్మల్

1వ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ముధోల్,ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముథోల్‌లోని 1 వ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్ హాజరై అన్నప్రాశన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు (కొలొస్ట్రమ్) పసిపాపలకు మొదటి టీకా వంటివని తెలిపారు. ముర్రుపాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. శిశువులకు ఆరు నెలల వయస్సు వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. అంగన్వాడీ సేవల ప్రాముఖ్యతను వివరిస్తూ, పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్య పరిరక్షణకు తల్లిపాలు ఎంతో అవసరమని తెలిపారు. తల్లులకు శిశు సంరక్షణ, పోషకాహారంపై అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రాజశ్రీ, వార్డు సభ్యులు విశ్వంబర్, నజియా అఫ్రోజ్, ముజీబ్, ఏఎన్‌ఎం విజయ, జ్యోతి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముధోల్,ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముథోల్‌లోని 1 వ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్ హాజరై అన్నప్రాశన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు (కొలొస్ట్రమ్) పసిపాపలకు మొదటి టీకా వంటివని తెలిపారు. ముర్రుపాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. శిశువులకు ఆరు నెలల వయస్సు వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు.
అంగన్వాడీ సేవల ప్రాముఖ్యతను వివరిస్తూ, పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్య పరిరక్షణకు తల్లిపాలు ఎంతో అవసరమని తెలిపారు. తల్లులకు శిశు సంరక్షణ, పోషకాహారంపై అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రాజశ్రీ, వార్డు సభ్యులు విశ్వంబర్, నజియా అఫ్రోజ్, ముజీబ్, ఏఎన్‌ఎం విజయ, జ్యోతి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.