Sunday, 2 August 2026
  • Home  
  • ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
- ఖమ్మం

ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్ ) ముదిగొండ / ఖమ్మం ఖమ్మం జిల్లాముదిగొండ: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేణు కుమార్ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు వేణు కుమార్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలను నమ్మి పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే తన సూసైడ్ నోట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరకు చేరవేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, యువకుడి ఆరోగ్య పరిస్థితి, అలాగే పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )

ముదిగొండ / ఖమ్మం

ఖమ్మం జిల్లాముదిగొండ: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేణు కుమార్ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

ఆత్మహత్యాయత్నానికి ముందు వేణు కుమార్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలను నమ్మి పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు అందులో పేర్కొన్నట్లు తెలిసింది.

అలాగే తన సూసైడ్ నోట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరకు చేరవేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, యువకుడి ఆరోగ్య పరిస్థితి, అలాగే పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.