Thursday, 1 October 2026
  • Home  
  • హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడుదాం గ్రామ గ్రామాన GMPS జెండాల ఆవిష్కరణను జయప్రదం చేయండి.
- వరంగల్

హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడుదాం గ్రామ గ్రామాన GMPS జెండాల ఆవిష్కరణను జయప్రదం చేయండి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని పశువైద్యశాల వద్ద GMPS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సొసైటీ అధ్యక్షులు కాసాని రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పరికి మధుకర్ మాట్లాడుతూ, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం 1995లో ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుతో గ్రామ గ్రామాన GMPS జెండాలను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. సంఘం ఏర్పడిన నాటి నుంచి గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. 559, 1016 జీవోలను సాధించడం ద్వారా తుమ్మ చెట్లు, పంచరాయి, పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో పశువులను మేపుకునే హక్కు కోసం సంఘం పోరాడిందని తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు గొర్రెల కాపరి గొర్రెల కాపరి చనిపోయినప్పుడు రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియా, గొర్రెలు, మేకలకు సంవత్సరానికి మూడుసార్లు నట్టల నివారణతో పాటు ఇతర వ్యాక్సిన్లు అందించడం వంటి అంశాలు సంఘం పోరాటాల ఫలితమేనన్నారు. గొల్ల కురుమలకు రూ.2 లక్షల నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపించారు. ఈ హామీ అమలు కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెలు కావరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్రెలు, మేకల పెంపకందారుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని, అందరూ ఐక్యంగా పోరాడాలని పరికి మధుకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చింతకింది అశోక్, పెరుమళ్ల శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంతుర్తి అన్వేష్, కసరబోయిన కుమారస్వామి, చిలపాక మొగిలి, కావటి ఐలయ్య, కొల్లూరి మల్లయ్య, ఇట్టబోయిన అశోక్, అందే వెంకట రాములు, కాసాని కుమారస్వామి, కుర్రు రవికుమార్, కుక్కల రాజు, కసరబోయిన రాజకుమార్, దేనబోయిన రజనీకాంత్, బోయిని శ్రీకాంత్, కుక్కల అశోక్, కుక్కల సాంబరాజు, తోటకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని పశువైద్యశాల వద్ద GMPS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సొసైటీ అధ్యక్షులు కాసాని రమేష్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పరికి మధుకర్ మాట్లాడుతూ, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం 1995లో ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుతో గ్రామ గ్రామాన GMPS జెండాలను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు.
సంఘం ఏర్పడిన నాటి నుంచి గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. 559, 1016 జీవోలను సాధించడం ద్వారా తుమ్మ చెట్లు, పంచరాయి, పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో పశువులను మేపుకునే హక్కు కోసం సంఘం పోరాడిందని తెలిపారు.
అలాగే ప్రమాదవశాత్తు గొర్రెల కాపరి గొర్రెల కాపరి చనిపోయినప్పుడు రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియా, గొర్రెలు, మేకలకు సంవత్సరానికి మూడుసార్లు నట్టల నివారణతో పాటు ఇతర వ్యాక్సిన్లు అందించడం వంటి అంశాలు సంఘం పోరాటాల ఫలితమేనన్నారు.
గొల్ల కురుమలకు రూ.2 లక్షల నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపించారు. ఈ హామీ అమలు కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెలు కావరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గొర్రెలు, మేకల పెంపకందారుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని, అందరూ ఐక్యంగా పోరాడాలని పరికి మధుకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చింతకింది అశోక్, పెరుమళ్ల శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంతుర్తి అన్వేష్, కసరబోయిన కుమారస్వామి, చిలపాక మొగిలి, కావటి ఐలయ్య, కొల్లూరి మల్లయ్య, ఇట్టబోయిన అశోక్, అందే వెంకట రాములు, కాసాని కుమారస్వామి, కుర్రు రవికుమార్, కుక్కల రాజు, కసరబోయిన రాజకుమార్, దేనబోయిన రజనీకాంత్, బోయిని శ్రీకాంత్, కుక్కల అశోక్, కుక్కల సాంబరాజు, తోటకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.