రాపర్తి సుబ్బలక్ష్మి అమ్మ ప్రధమ వర్ధంతి సందర్భంగా గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఘనంగా
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 16. (ప్రజా ప్రతిభ )
గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు అమ్మగారైన స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 100 మంది దివ్యాంగ చిన్నారులకు కాలిపర్లు పంపిణీ చేసి వారికి అండగా నిలిచారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన సుమారు 3,000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహంగా ఒక్కో జామ మొక్కను అందజేశారు.
అంతేకాకుండా, స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థంగా స్టీల్ వస్తువులపై ఆమె పేరును ముద్రించి, బ్యాగులతో కలిసి వేలాది మందికి పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకున్నాయి.
ఈ రెండు రోజుల కార్యక్రమాలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మికి ఘనంగా నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను పలువురు అభినందించారు.



