ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హైవే నిర్మాణానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హైవే ప్రారంభాన్ని స్వాగతించారు.



