పి. గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలానికి పాసలపూడి వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా చేస్తున్న త్రాగునీరు సరైన విధంగా శుద్ధి చేయకుండా పంపిణీ చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పి. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. కలువల నుంచి వచ్చిన నీటిలాగే శుద్ధి చేయని నీటిని గ్రామాలకు సరఫరా చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి శుద్ధి ప్రక్రియను కట్టుదిట్టంగా అమలు చేసి, ప్రతి గ్రామానికి నాణ్యమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
Uploaded Video:



