వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు
రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు
మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు చెక్
రూ.10 లక్షల లోపు విలువైన భూమికి స్టాంప్ డ్యూటీ కేవలం రూ.100
వీలునామా లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో ఎఫ్ఎంసీ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇప్పటికే నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లకు అనుమతించిన సర్కార్, తాజాగా మరో కీలక ముందడుగు వేసింది.

