Wednesday, 29 July 2026
  • Home  
  • జాతీయ తెలుగు వెలుగు సంబరాలలో బీదా సి.నా.రే కు ఘన నివాళి
- ఆంధ్రప్రదేశ్

జాతీయ తెలుగు వెలుగు సంబరాలలో బీదా సి.నా.రే కు ఘన నివాళి

( జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఢిల్లీలో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించినజాతీయ తెలుగు వెలుగు సంబరాలలో రాజ్యసభ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్ . పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా జీవితంలో విశిష్ట సేవలు అందించిన ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ , ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఉద్దర్రాజు విశ్వనాథరాజు తో పాటు సాహిత్యం, విద్య, సామాజిక సేవ, వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ, తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కలుపుతూ భారతీయ సంస్కృతికి చిరస్థాయిగా సేవలందిస్తోందన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి సాహిత్య సంపద భావితరాలకు మార్గదర్శకమని కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తున్న జాతీయ తెలుగు సారస్వత పరిషత్ నిర్వాహకులు, సభ్యులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో తెలుగు భాషపై అభిమానం, సాంస్కృతిక విలువలపై అవగాహనను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో , కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు, సామాజిక సేవకులు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. –

( జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఢిల్లీలో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించినజాతీయ తెలుగు వెలుగు సంబరాలలో రాజ్యసభ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్ . పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా జీవితంలో విశిష్ట సేవలు అందించిన ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ , ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఉద్దర్రాజు విశ్వనాథరాజు తో పాటు సాహిత్యం, విద్య, సామాజిక సేవ, వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ, తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కలుపుతూ భారతీయ సంస్కృతికి చిరస్థాయిగా సేవలందిస్తోందన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి
సాహిత్య సంపద భావితరాలకు మార్గదర్శకమని కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తున్న జాతీయ తెలుగు సారస్వత పరిషత్ నిర్వాహకులు, సభ్యులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో తెలుగు భాషపై అభిమానం, సాంస్కృతిక విలువలపై అవగాహనను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో , కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు, సామాజిక సేవకులు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.