Wednesday, 29 July 2026
  • Home  
  • పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఉదయగిరి ఏవో విజయభాస్కర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఉదయగిరి ఏవో విజయభాస్కర్

ఉదయగిరి మండలంలోని గంగులూరి చెరువుపల్లి, బిజ్జంపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతులకు పంటల బీమా పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి (ఏవో) విజయభాస్కర్, టెక్నికల్ ఏవో వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు తప్పనిసరిగా పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల నమోదు, ఈ-క్రాప్ వివరాలను సకాలంలో పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అధికారులు పంటల స్థితిగతులను పరిశీలించి అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.