Wednesday, 29 July 2026
  • Home  
  • UPI చెల్లింపుల్లో కీలక మార్పులు.. యూజర్ల గోప్యతకు ప్రాధాన్యం
- ఖమ్మం

UPI చెల్లింపుల్లో కీలక మార్పులు.. యూజర్ల గోప్యతకు ప్రాధాన్యం

ఖమ్మం, జూలై పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి ఖమ్మం జిల్లా రిపోర్టర్ డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, UPI యాప్‌లలో వినియోగదారుల పూర్తి మొబైల్ నంబర్‌ను ప్రదర్శించకుండా, కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా బ్యాంకులు, UPI సేవలందించే యాప్‌లు మార్పులు చేయాలని NPCI ఆదేశించింది. అంతేకాకుండా, భద్రతను మరింత పెంచే లక్ష్యంతో ఫోన్ నంబర్ ఆధారిత గుర్తింపుకు బదులుగా యూజర్‌నేమ్ ఆధారిత UPI ఐడీలను ప్రోత్సహించాలని సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు బ్యాంకులు, UPI యాప్‌లకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, డిజిటల్ లావాదేవీల్లో గోప్యతకు మరింత ప్రాధాన్యం లభించనుంది.

ఖమ్మం, జూలై
పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి ఖమ్మం జిల్లా రిపోర్టర్

డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, UPI యాప్‌లలో వినియోగదారుల పూర్తి మొబైల్ నంబర్‌ను ప్రదర్శించకుండా, కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా బ్యాంకులు, UPI సేవలందించే యాప్‌లు మార్పులు చేయాలని NPCI ఆదేశించింది.

అంతేకాకుండా, భద్రతను మరింత పెంచే లక్ష్యంతో ఫోన్ నంబర్ ఆధారిత గుర్తింపుకు బదులుగా యూజర్‌నేమ్ ఆధారిత UPI ఐడీలను ప్రోత్సహించాలని సూచించింది.

ఈ మార్పులను అమలు చేసేందుకు బ్యాంకులు, UPI యాప్‌లకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, డిజిటల్ లావాదేవీల్లో గోప్యతకు మరింత ప్రాధాన్యం లభించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.