ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
గురుపౌర్ణమి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ ప్రముఖ గురువులు శ్రీ మోతుకూరి నారాయణరావు గారు, శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు గార్లను మర్యాదపూర్వకంగా కలిసి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గురువుల ఆశీస్సులు తీసుకున్న రుద్ర ప్రదీప్, భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి మార్గదర్శకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు..



