Wednesday, 29 July 2026
  • Home  
  • ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
- ఖమ్మం

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

ఖమ్మం, జూలై (పున్నమి న్యూస్) ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఆరాధన కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 54వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల నరేంద్ర సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని సాయిబాబా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)

ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఆరాధన కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 54వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల నరేంద్ర సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని సాయిబాబా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.