ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన 20 నెలల బకాయిలను 2028లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. జనవరి, మార్చి, మే, జులై నెలల్లో బకాయిలు జమ చేయనున్నారు. అలాగే 2024 జులై 1 నుంచి 2.73 శాతం డీఏ చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన 26 నెలల బకాయిలను 2027లో నాలుగు విడతల్లో అందించనున్నారు. ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరు నెలల్లో బకాయిలు చెల్లించనున్నారు.

ఉద్యోగులకు సీఎం గుడ్స్క్యూస్.. రెండు డీఏలు విడుదల