అనకాపల్లి జిల్లా, జూలై 27 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టులో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో రానున్న అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి’ కార్యక్రమాన్ని ఏటికొప్పాకలో నిర్వహించారు.
ఏటికొప్పాక బండిమాంబ గుడి ఆవరణలో వెలుగు సిబ్బంది ఏపీఎం రాణి ఆధ్వర్యంలో రంగురంగుల ముగ్గు వేసి, అందులో ‘ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి’ అని రంగులతో రాసి వినూత్నంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, వెలుగు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఏటికొప్పాకలో రంగవల్లితో ‘ఉత్తరాంధ్రకు రెక్కలు’.. ఆకట్టుకున్న కార్యక్రమం!
అనకాపల్లి జిల్లా, జూలై 27 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టులో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో రానున్న అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి’ కార్యక్రమాన్ని ఏటికొప్పాకలో నిర్వహించారు. ఏటికొప్పాక బండిమాంబ గుడి ఆవరణలో వెలుగు సిబ్బంది ఏపీఎం రాణి ఆధ్వర్యంలో రంగురంగుల ముగ్గు వేసి, అందులో ‘ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి’ అని రంగులతో రాసి వినూత్నంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, వెలుగు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

