Sunday, 26 July 2026
  • Home  
  • బోనాల మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- ఖమ్మం

బోనాల మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

బోనాల మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్షాలు సమృద్ధిగా కురవాలని అందరికీ మంచి జరగాలని పువ్వాడ ఆకాంక్ష జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం : నగరంలోని 48వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ మహోత్సవం ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో ఖమ్మం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులకు మంచి పంటలు పండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

బోనాల మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వర్షాలు సమృద్ధిగా కురవాలని అందరికీ మంచి జరగాలని పువ్వాడ ఆకాంక్ష

జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం :
నగరంలోని 48వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ మహోత్సవం ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో ఖమ్మం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులకు మంచి పంటలు పండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.