ప్రొద్దుటూరు 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా.. పోలీసులు విచారణ చేపట్టారు. రామేశ్వరం ఏరియాలో రాణి అనే వివాహిత తన ఇంటిలో మరణించి ఉండగా.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలన చేపట్టారు. సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టారు.





