Sunday, 26 July 2026
  • Home  
  • శివాలయానికి రుద్రాక్ష మాలల విరాళం
- తిరుపతి

శివాలయానికి రుద్రాక్ష మాలల విరాళం

శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సలహా మండలి మాజీ సభ్యుడు అయిత మురళీకృష్ణ శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రుద్రాక్ష మాలలను విరాళంగా అందజేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లకు వాటిని అధికారికంగా అందించారు. ఆలయంలో కొలువై ఉన్న 63 మంది నయనార్ల విగ్రహాలు, పాండవులు, ద్రౌపది దేవి, శ్రీకృష్ణుడి విగ్రహాలతో పాటు నయనార్ల వద్ద ప్రతిష్ఠించిన శివలింగాలకు నిత్య అలంకరణలో ఈ రుద్రాక్ష మాలలను వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత అయిత మురళీకృష్ణ సేవాభావాన్ని దేవస్థాన అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరిబాబు యాదవ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.