Sunday, 26 July 2026
  • Home  
  • తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భాగస్వామ్యమే విద్యార్థినుల విజయానికి బలమైన పునాది
- విశాఖపట్నం

తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భాగస్వామ్యమే విద్యార్థినుల విజయానికి బలమైన పునాది

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యమే విద్యార్థినుల విజయానికి బలమైన పునాది ఆనందపురం, ఆనందపురం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ డే ఘనంగా జరిగింది. శ్రీ మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధినేత, కేజీబీవీ దత్తత ప్రదాత శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జోగా చంద్రశేఖర్, జీసీడీవో శ్రీమతి శ్రీదేవి, మండల విద్యాశాఖ అధికారి గంగరాజు, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి రౌతు శ్యామల గారు ఆనందపురం పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ షేక్ షహనాజ్ ఫాతిమా, వృక్ష ఫౌండేషన్ అధినేత కాకర సురేష్ కుమార్, భీమిలి నియోజకవర్గం స్టూడెంట్ ఫెడరేషన్ కార్యదర్శి కోరాడ వైకుంఠం, తమ్మిన అప్పలరాజు, ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు, మేము సైతం వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిరెడ్డి దేవుడు బాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తమ్మిన అప్పలరాజు, వైస్ చైర్మన్ ఓ. మంగ అప్పన్న అతిథులుగా హాజరయ్యారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీమతి దొండా చంద్రకళ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ​ ​పాఠశాల అభివృద్ధికి నిరంతరం అండగా ఉంటా: శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ సాంస్కృతిక కార్యక్రమాలకు రూ. 1 లక్ష విరాళం ప్రకటన. ​ ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ — పాఠశాలకు గానీ, ఇక్కడ చదువుకునే విద్యార్థినులకు గానీ ఏ అవసరం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభకు ముచ్చటపడిన ఆయన, పాఠశాలలో కార్యక్రమాలను మరింత ప్రోత్సహించేందుకు తన వంతుగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) అందజేస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేవలం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయాలని ప్రిన్సిపల్ గారికి సూచించారు. ​ఉత్సాహంగా సాగిన తల్లిదండ్రుల ఆటపాటలు సమావేశం అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వినోదాత్మక ఆటపాటల పోటీలలో తల్లిదండ్రులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తమ వంతుగా భాగస్వామ్యంగా తల్లిదండ్రులు స్వచ్ఛందంగా స్వీట్స్ పలు రకాల పండ్లు,పువ్వులు అందజేశారు.

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యమే విద్యార్థినుల విజయానికి బలమైన పునాది

ఆనందపురం, ఆనందపురం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ డే ఘనంగా జరిగింది. శ్రీ మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధినేత, కేజీబీవీ దత్తత ప్రదాత శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జోగా చంద్రశేఖర్, జీసీడీవో శ్రీమతి శ్రీదేవి, మండల విద్యాశాఖ అధికారి గంగరాజు, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి రౌతు శ్యామల గారు ఆనందపురం పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ షేక్ షహనాజ్ ఫాతిమా, వృక్ష ఫౌండేషన్ అధినేత కాకర సురేష్ కుమార్, భీమిలి నియోజకవర్గం స్టూడెంట్ ఫెడరేషన్ కార్యదర్శి కోరాడ వైకుంఠం, తమ్మిన అప్పలరాజు, ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు, మేము సైతం వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిరెడ్డి దేవుడు బాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తమ్మిన అప్పలరాజు, వైస్ చైర్మన్ ఓ. మంగ అప్పన్న అతిథులుగా హాజరయ్యారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీమతి దొండా చంద్రకళ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు.

​పాఠశాల అభివృద్ధికి నిరంతరం అండగా ఉంటా: శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్
సాంస్కృతిక కార్యక్రమాలకు రూ. 1 లక్ష విరాళం ప్రకటన.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ — పాఠశాలకు గానీ, ఇక్కడ చదువుకునే విద్యార్థినులకు గానీ ఏ అవసరం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభకు ముచ్చటపడిన ఆయన, పాఠశాలలో కార్యక్రమాలను మరింత ప్రోత్సహించేందుకు తన వంతుగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) అందజేస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేవలం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయాలని ప్రిన్సిపల్ గారికి సూచించారు.
​ఉత్సాహంగా సాగిన తల్లిదండ్రుల ఆటపాటలు
సమావేశం అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వినోదాత్మక ఆటపాటల పోటీలలో తల్లిదండ్రులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తమ వంతుగా భాగస్వామ్యంగా తల్లిదండ్రులు స్వచ్ఛందంగా స్వీట్స్ పలు రకాల పండ్లు,పువ్వులు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.