డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ. పోలవరం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో శుక్రవారం కూటమి ప్రభుత్వం విద్యార్థినుల కోసం పంపిణీ చేసిన వివిధ రకాల వసతి సామగ్రి, దినసరి అవసరాల వస్తువులను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అధికారులు,ఐ. పోలవరం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి విద్యార్థినులకు పంపిణీ చేశారు.
అనంతరం శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు విద్యార్థినులతో ఆత్మీయంగా ముఖాముఖి సమావేశమై వారి విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఆరోగ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. వసతి గృహంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా, సిబ్బంది నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అందిస్తున్న మెనూ గురించి వివరాలు తెలుసుకుని, వంటశాలను సందర్శించి భోజనం నాణ్యతను, పరిశుభ్రతను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వసతి సామాగ్రిని పంపిణీ చేసిన శాసనసభ విప్ సుబ్బరాజు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ. పోలవరం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో శుక్రవారం కూటమి ప్రభుత్వం విద్యార్థినుల కోసం పంపిణీ చేసిన వివిధ రకాల వసతి సామగ్రి, దినసరి అవసరాల వస్తువులను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అధికారులు,ఐ. పోలవరం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి విద్యార్థినులకు పంపిణీ చేశారు. అనంతరం శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు విద్యార్థినులతో ఆత్మీయంగా ముఖాముఖి సమావేశమై వారి విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఆరోగ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. వసతి గృహంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా, సిబ్బంది నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందిస్తున్న మెనూ గురించి వివరాలు తెలుసుకుని, వంటశాలను సందర్శించి భోజనం నాణ్యతను, పరిశుభ్రతను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

