పున్నమి ప్రతినిధి జూలై 24: బిజినపల్లి: మండలకేంద్రంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఎంపీడీవో కథలప్పకు ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో పేద ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న తమకు వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన వేతనాలను తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

బిజినెపల్లి : ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు చెల్లించాలి: ఎంపీడీవోకు వినతి