నల్లచెరువుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం
పున్నమి ప్రతినిధి వేముల మండలం (జూలై 24)
నల్లచెరువుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధి మరియు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయాన్ని పెంపొందించే ఉద్దేశంతో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్, డి.ఆర్.డి.ఏ. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆటలు పాటలతో విద్యను అందించి మానసిక విజ్ఞాము పెంపొందించాలని కోరారు. విద్యార్థులు సోషల్ మీడియాలో చూసే వీడియో మరియూ , ఫోన్ వినియోగం పైన తల్లిదండ్రులు బాధ్యతయుతమైన నిఘా ఉంచాలని కోరారు
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుదాస్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, హాజరు మరియు సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, పాఠశాల మౌలిక వసతులు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విస్తృతంగా చర్చించారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా, చదువుపై శ్రద్ధ చూపేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సమావేశం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య మరింత సమన్వయాన్ని పెంచడంతో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని అందించింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ సమాఖ్య అసిస్టెంట్ లు పుష్పలత, జయ రాజ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









