ఖమ్మం, జులై
(పున్నమి న్యూస్)
ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి గట్టి హెచ్చరిక వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే బెల్ట్ షాపులు, బార్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.


