*ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్*
*”పోలీసుల దౌర్జన్యం నశించాలి, మోడీ నియంతృత్వ పోకడలు నశించాలి”*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
*వైరా:* ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు *రాహుల్ గాంధీపై* పోలీసులు జరిపిన దాడిని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ *కట్ల సంతోష్* తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసుల దాడిలో రాహుల్ గాంధీ గాయపడి ముక్కు నుంచి రక్తం కారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
*”పోలీసుల దౌర్జన్యం నశించాలి”* అంటూ నినదించిన కట్ల సంతోష్, కేంద్రంలోని *నరేంద్ర మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను* తీవ్రంగా విమర్శించారు. ప్రజల గొంతు నొక్కేందుకు, ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డంగా వాడుకుంటోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కట్ల సంతోష్ డిమాండ్ చేశారు.



