బెల్లంపల్లి జూలై 21: బెల్లంపల్లి పట్టణం లోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో హైవే రోడ్డు పక్కన జర్నలిస్టులకు కేటాయించిన భూమిని భూ కబ్జాదారుల నుంచి కాపాడాలని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మని రామ్ సింగ్ ఆధ్వర్యంలో విప్లవ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల కాలనీకి కేటాయించిన భూమిని పరిరక్షించాలని వారు కోరారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న భూ కబ్జాలపై కూడా అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబాల మహేందర్ (SGKS) సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, ఎం. పోచమల్లు (AIFTU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోగర్ల శంకర్ (TUCI) నాయకులు తదితరులు పాల్గొన్నారు.


