రాజమహేంద్రవరం, జూలై 20 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన సందర్భంగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూలను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ భేటీలో నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.



