బిజినపల్లి: మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం ప్రాంగణంలో బిజినపల్లి మండలానికి చెందిన లంబాడీ సామాజికవర్గ లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సిఎమ్ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. బాధితులు ఈ సాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేతవత్ మాన్య నాయక్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


