నాగర్‌కర్నూల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో సీజనల్ పరిస్థితులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వివిధ శాఖల అధికారుల తీరుపై చర్చించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సేవలందించాలని స్పష్టం చేశారు.




