Wednesday, 22 July 2026
  • Home  
  • జీవో 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ నిరసన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జీవో 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ నిరసన

జీవో 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ నిరసన ఉదయగిరి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్యుమెంట్ రైటర్లు సోమవారం నిరసన చేపట్టారు. జీవో 396 అమలుతో తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకుని డాక్యుమెంట్ రైటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 20 నుంచి 31 వరకు “పెన్‌డౌన్” ఉద్యమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జీవో 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ నిరసన
ఉదయగిరి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్యుమెంట్ రైటర్లు సోమవారం నిరసన చేపట్టారు. జీవో 396 అమలుతో తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకుని డాక్యుమెంట్ రైటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 20 నుంచి 31 వరకు “పెన్‌డౌన్” ఉద్యమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.