Thursday, 9 July 2026
  • Home  
  • గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మాసారపు సుబ్బయ్య
- తిరుపతి

గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మాసారపు సుబ్బయ్య

శ్రీ కాళహస్తి, జులై 09, (పున్నమి న్యూస్) : చిత్తూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ నాయకులు మాసారపు సుబ్బయ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, మౌలిక సదుపాయాలు, భోజన నాణ్యతతో పాటు వారి విద్యా ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రతిరోజూ ఉపాధ్యాయులు తరగతులకు సక్రమంగా హాజరవుతున్నారా, నాణ్యమైన విద్యను అందిస్తున్నారా అనే అంశాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది విధి నిర్వహణ తీరును తెలుసుకోవడానికి పాఠశాల హాజరు పట్టికలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గిరిజన విద్యార్థినుల విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా బుద్ధులతో పాటు పౌష్టికాహారాన్ని నిరంతరాయంగా అందించేలా ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సుబ్బయ్య ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.