Thursday, 9 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో జనసేన ఆధ్వర్యంలో 86వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో జనసేన ఆధ్వర్యంలో 86వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం

శ్రీ కాళహస్తి, జులై 09, (పున్నమి న్యూస్) : జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద గురువారం పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 86వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నిరుపేదలు, బాటసారుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా గత 86 వారాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుండటం విశేషం. సమాజంలో ఆకలితో అలమటించే ప్రతి ఒక్కరికీ అండగా నిలవాలన్న పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ వారం జరిగిన అన్నదానంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, ప్రయాణికులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రముఖ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, నవీన్, రమేష్ బాబు, జానీ, ముని చంద్ర, రాజా, చందు పాల్గొన్నారు. అలాగే జనసేన వీరమహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, గోపిక, లక్ష్మి తదితరులు పాల్గొని అన్నదాన వితరణలో చురుగ్గా సేవలందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.