శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రసాదాల విక్రయ విధానం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రసాదాలు అమ్ముడుపోక వృధా అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విధానాన్ని వెనువెంటనే నివారించాలని కోరుతూ ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ..సాంకేతికత పేరుతో తెచ్చిన ఆన్లైన్ విధానం వల్ల నిరక్షరాస్యులు, మొబైల్ ఫోన్లు లేని సామాన్య భక్తులు ప్రసాదాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. ప్రసాదాల అమ్మకాలు జరగకపోవడంతో అవి వృధాగా నేలపాలవుతున్నాయని, ఈ నష్టాన్ని అరికట్టడానికి పాత పద్ధతిలోనే విక్రయాలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కర్రిముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు రాహుల్ రాయల్, పట్టణ యువజన అధ్యక్షుడు ఆంటోనీ, నాయకులు నాగూరయ్యా, ముని కృష్ణయ్య, చందు, నాగరాజు, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి, మహేష్ పాల్గొన్నారు.

ఆన్లైన్ ప్రసాదాల విక్రయ విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్