కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీలో గల చేయూత మహిళ మార్ట్ లో నిధులు పక్కదారి పట్టడంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ లో పిర్యాదు చేసిన తాళ్లరేవు మండల వై.యస్.ఆర్.సి.పి నాయకులు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మహిళ సాధికారత, ఆర్థిక స్వాలంబన కోసం స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి, వారిని ఆర్థికంగా బలపరచడానికి ప్రారంభించిన ఒక అద్భుతమైన ఆలోచనే చేయూత మహిళా మార్ట్ అన్నారు. గత ప్రభుత్వంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు, అదే విధంగా పార్టీ కార్యక్రమాలు ఏమి జరిగినా వాటికి అవసరమైన నిత్యవసర సరుకులను ఈ మార్ట్ ద్వారానే కొనుగోలు చేసి సుమారుగా రెండు కోట్ల రూపాయల విలువైన సామాగ్రి కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఎంతగానో సహకరించారని, ఆ విధంగా రాష్ట్రంలోనే ఈ మార్ట్ అత్యధిక టర్నోవర్ జరిగి మొదటి స్థానంలో ఉండేదని అటువంటి వ్యాపారాన్ని గడిచినటువంటి రెండేళ్ల కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసి నిధులను సొంత ఖాతాలకు మళ్ళించుకుని టిడిపి నాయకులు మేస్తున్నారు అని ఆరోపించారు. టిడిపి నాయకుల కబంధ హస్తాలలో మహిళా సంఘాలు నిధులు స్వాహా అయిపోయాయని తక్షణమే ఆ సొమ్ములను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు, కోరంగి ఎంపీటీసీ పోతుల రత్నకుమారి మాట్లాడుతూ మహిళా సంఘాలలోని సభ్యుల నుంచి 200 రూపాయల చొప్పున వసూలు చేసి ఆ సొమ్ములతో మూల ధనాన్ని ఏర్పరిచి ప్రభుత్వం తరపున కొంత నిధులు ఏర్పాటు చేసి ఈ మార్ట్ ను ప్రారంభించారని, ఆ మహిళా సంఘాలలోని పేద మహిళల సొమ్ము ఈరోజు అక్రమార్కుల అవసరాలకు మళ్లించడం దురదృష్టం అని అన్నారు. ఈ మార్టు ఇంచార్జ్ గా వ్యవహరించిన పితాని హేమలత, సెక్రెటరీగా వ్యవహరించిన విత్తనాల బేబీ మరి కొంతమంది వారి బంధువర్గాల బ్యాంకు ఖాతాలకు నిధులు మళ్లించుకుని ఇష్టానుసారం అనుభవించారని దీనిపై తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు పొన్నాడ భైరవమూర్తి, నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షులు పందిరిపల్లి రాజేష్, ఎంపీటీసీ నందికొళ్ల శ్రీదేవి, కోరంగి ఉప సర్పంచ్ కామాడి భైరవ మూర్తి, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బొంతుమోహన్, మండల ప్రధాన కార్యదర్శి మోకా మధుబాబు, మండల నాయకులు ఆకుల వెంకన్న, నందికొళ్ల శివన్నారాయణ, కొటికలపూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళ మార్ట్ నిధుల గోల్ మాల్ పై విచారణ జరపాలి మార్ట్ ఇంచార్జీ, పీడీ పై చర్యలు తీసుకోవాలి – వుంగరాల సంతోష్