Thursday, 9 July 2026
  • Home  
  • బలభద్రపురంలో టీడీపీలోకి వైసీపీ నాయకులు, 10 కుటుంబాల చేరిక
- తూర్పు గోదావరి

బలభద్రపురంలో టీడీపీలోకి వైసీపీ నాయకులు, 10 కుటుంబాల చేరిక

మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం   అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బలభద్రపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండ వీరరాఘవరెడ్డి, మండ వెంకటేశ్వరరెడ్డి, తేతలి శివ దొరారెడ్డి, సత్తి రామారెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి తదితరులతో పాటు 10 కుటుంబాలు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సురేష్, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం

 

అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బలభద్రపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండ వీరరాఘవరెడ్డి, మండ వెంకటేశ్వరరెడ్డి, తేతలి శివ దొరారెడ్డి, సత్తి రామారెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి తదితరులతో పాటు 10 కుటుంబాలు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సురేష్, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.