అనకాపల్లి జిల్లా, జూలై 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చిన్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గ్రామ ప్రజల సహకారంతో ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామంలో సుఖశాంతులు, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామిని ప్రార్థించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



