ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూలై 2: మనుబోలు మండలం మడమనూరు సమీపంలో రూ.3,600 కోట్ల పెట్టుబడితో శ్యామ్ స్టీల్ మెటాలిక్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం అధికారులు, రైతులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బండేపల్లి కాలువ పనులను పరిశీలించి, మడమనూరులో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రూ.3,600 కోట్ల స్టీల్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి ఉపాధి: సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూలై 2: మనుబోలు మండలం మడమనూరు సమీపంలో రూ.3,600 కోట్ల పెట్టుబడితో శ్యామ్ స్టీల్ మెటాలిక్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం అధికారులు, రైతులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బండేపల్లి కాలువ పనులను పరిశీలించి, మడమనూరులో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

