ఖమ్మం, జూలై 1
(పువ్వాడ నాగేంద్ర కుమార్ – పున్నమి జిల్లా రిపోర్టర్)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న రూ.1,000 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ ఎదురుగా రాస్తారోక నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు చావా ప్రణీత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెల్లంకొండ అజయ్, నగర కార్యదర్శి దీకొండ కార్తీక్, నగర బాధ్యులు దీపక్, సిద్ధు, ఫణీంద్ర, సాయి చరణ్, చరణ్, నందకిషోర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



