ఆత్మకూరు జూన్ 30(హరికిరణ్, పున్నమి ప్రతినిధి )
ప్రయాణికుల సౌకర్యార్థం ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు స్టేషన్ సముదాయంలో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను మంగళవారం ప్రారంభించారు. RTC జోనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాంట్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా తీసుకున్న ఈ చర్య ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ప్రయాణికుల సౌకర్యార్థం RO వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన దాత రాపూరు వెంకట సుబ్బా రెడ్డి (ZPTC, అనంతసాగరం మండలం)కు అధికారులు, నాయకులు అభినందనలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో దాతలు భాగస్వామ్యం కావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో RTC జిల్లా ప్రజా రవాణాధికారి షమీమ్, ఆత్మకూరు డిపో మేనేజర్ M. శివకేష్ యాదవ్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, ఆర్టీసీ డిపో సిబ్బంది పాల్గొన్నారు.



