ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి)
తిరుపతి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వెంకటాచలం మండలం అప్పయ్యగేట్ సమీపంలో టైర్ పంచర్ కావడంతో ప్రమాదానికి గురైంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా, ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదుపుతప్పిన బస్సు రోడ్డును దాటి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. పొలంలోని మట్టి గడ్డలు ఎత్తుగా ఉండటంతో బస్సు అక్కడే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

టైర్ పంచర్తో పొలంలోకి దూసుకెళ్లిన ఎలక్ట్రిక్ బస్సు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి) తిరుపతి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వెంకటాచలం మండలం అప్పయ్యగేట్ సమీపంలో టైర్ పంచర్ కావడంతో ప్రమాదానికి గురైంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా, ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదుపుతప్పిన బస్సు రోడ్డును దాటి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. పొలంలోని మట్టి గడ్డలు ఎత్తుగా ఉండటంతో బస్సు అక్కడే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

