ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ పరిధిలోని కుడితిపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ్ పర్యవేక్షించగా, వీఆర్వో అబూబక్కర్, వీఎల్ఏ తిరుమలేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు జాబితా వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోయిన ఆదినారాయణ, బీఎల్వోలు గుంజి రమేష్, ఆవుల తులసిరామ్, మండల సిబ్బంది పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు.

కుడితిపల్లిలో సర్ కార్యక్రమం నిర్వహణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ పరిధిలోని కుడితిపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ్ పర్యవేక్షించగా, వీఆర్వో అబూబక్కర్, వీఎల్ఏ తిరుమలేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు జాబితా వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోయిన ఆదినారాయణ, బీఎల్వోలు గుంజి రమేష్, ఆవుల తులసిరామ్, మండల సిబ్బంది పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు.

