భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి నమోదైంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో పాటు పూర్తి స్థాయి బీటీఏపై చర్చించారు. మార్కెట్ యాక్సెస్, డిజిటల్ ట్రేడ్, సరఫరా గొలుసు బలోపేతం, దిగుమతి-ఎగుమతి అడ్డంకుల తొలగింపు వంటి అంశాలపై ఇరు దేశాలు సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసి, సమగ్ర వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే రెండు దేశాల వ్యాపార సంబంధాలు మరింత బలపడనున్నాయి.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో కీలక పురోగతి